సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవెంటిలేటరుపైనే విద్యార్థిని

1 గంట క్రితం

876813950_2754450314958062_7217904323699389413_n.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 12:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మణిపాల్‌ ‌వైద్యుల వెల్లడి

  • బాధితురాలికి వైఎస్‌ జగన్‌‌ పరామర్శ

  • నిందితుడికి కుడి కాలు తీసేసే అవకాశం : సూపరింటెండెంట్‌

ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి : ఉన్మాది హేమంత్‌ విద్యుత్‌ రంపంతో విచక్ష‍ణా రహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్‌పి హైస్కూల్‌ విద్యార్థిని ఇంకా వెంటిలేటరుపైనే ఉందని, అయినా ఆమె ఆరోగ్య పరిస్థితిలో కొంత మెరుగుదల ఉందని బెంగళూరులోని మణిపాల్‌ ‌వైద్యులు తెలిపారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై డ్యూటీ డాక్టర్‌ ‌భావన సోమవారం నివేదిక విడుదల చేశారు. ఆదివారం వరకు రక్తపోటును సాధారణ స్థాయికి తీసుకురావడానికి రెండు రకాల మందు లిచ్చే వారమని, ప్రస్తుతం ఒక రకంతోనే సాధారణ స్థాయిలో ఉంటోందని, కిడ్నీ పనితీరు కూడా సాధారణ స్థితిలో ఉందని వివరించారు. గాయాల పరిస్థితిని సర్జన్లు పరిశీలించిన తరువాత ప్లాస్టిక్‌ ‌సర్జరీ, ఆర్థోపెడిక్‌ ‌సర్జరీలు చేస్తారని తెలిపారు.

రూ.50 లక్ష‍లు పరిహారం ఇవ్వాలి : వైఎస్‌ జగన్‌

విద్యార్థినిని బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్‌.జగన్‌మోహన్‌‌రెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఏకంగా రంపం తీసుకుని స్కూల్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్లు ఆడపిల్లల మీద దాడి చేశాడు. స్కూల్లో చదివే పిల్లల పరిస్థితి ఏంటి? ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో విచ్చలవిడిగా గంజాయి, బెల్టు షాపులు వెలిశాయి. వీటిని అరికట్టే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్‌ అయినందుకు తలదించుకోవాలి’’ అని అన్నారు. ప్రభుత్వం ఆ బాలిక కుటుంబానికి రూ.50 లక్ష‍లు ఇవ్వాలని, వైద్యానికి పూర్తిగా సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు.

నిందితుడికి కుడికాలు తీసేసే అవకాశం

పోలీసు కాల్పుల్లో గాయపడిన ఉన్మాది హేమంత్‌కు రక్తం ఎక్కువగా పోతుండటంతో కుడికాలు తీసేయాల్సి రావొచ్చని, అది శస్ర్త చికిత్సకు వెళ్లిన సమయంలో స్పష్టమవుతుందని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ‌మల్లీశ్వరి తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్