సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionహెచ్‌‌పిసిఎల్‌‌లో అగ్నిప్రమాదం

1 గంట క్రితం

హెచ్‌‌పిసిఎల్‌‌లో అగ్నిప్రమాదం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 12:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- ములగాడ (విశాఖపట్నం) : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌‌పిసిఎల్‌) విశాఖ రిఫైనరీలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక ప్రాంతం మల్కాపురంలో ఉన్న ఈ రిఫైనరీలోగల రఫ్ ప్లాంట్‌‌లో సల్ఫర్ ఫిట్‌ ‌వద్ద మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే స్పందించిన కంపెనీ అగ్నిమాపక సిబ్బంది శకటాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వివిధ కంపెనీల అగ్నిమాపక శకటాలు కూడా నివారణ చర్యల్లో భాగస్వామ్యమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయమూ జరగలేదు. ప్రమాదానికిగల కారణాలు తెలియరాలేదు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్