బాపట్ల : పంటలు, కరువు పరిస్థితులను పరిశీలించేందుకు బుధవారం బాపట్ల జిల్లాలో సిపిఎం బృందం పర్యటించింది. కొలలపూడి, బొల్లాపల్లి, తాటివాటి పాలెం, నాగరాజుపల్లి, తదితర గ్రామాల రైతులతో నేతలు సమావేశమయ్యారు. తమ సమస్యలు, కష్టాలను రైతులు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి వివరాలన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళదాం, పోరాడదాం అని నేతలు రైతులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, ఎం హరిబాబు, నాయకులు కంకణాల ఆంజనేయులు, వి.శివనాగ రాణి, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎస్. కె మాబు, బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య, జిల్లా నాయకులు పి కొండయ్య, కే రామకోటేశ్వరరావు, బి హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.
బాపట్లలో సిపిఎం బృందం పర్యటన
52 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 11:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)