బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్రంప్‌, అమెరికా మీడియా సంస్థల మధ్య కొనసాగుతున్న వివాదం

1 గంట క్రితం

Trump tells
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 11:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : అధ్యక్ష‍ుడు ట్రంప్‌, అమెరికా మీడియా సంస్థల మధ్య వివాదం కొనసాగుతోంది. ఐక్యరాజ్యసమితి పర్యటన సందర్భంగా మరోసారి ఉద్రిక్తంగా మారింది. మంగళవారం ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగానికి ముందు ట్రంప్‌ సిఎన్‌ఎన్‌ మీడియాకు చెందిన కైట్లాన్ కాలిన్స్‌పై విరుచుకుపడ్డారు. ‘‘మీరు ఇక్కడ ఉండకూడదు’’ అంటూ వ్యాఖ్యానించారు. సిఎన్‌ఎన్‌ తనపై వార్తలు ప్రసారం చేయబోమని గతంలో చెప్పిందని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం వైట్‌హౌస్‌ సిఎన్‌ఎన్‌, ఎంఎస్‌నౌ, పొలిటికో సంస్థలను నిషేధించడంతో పాటు పూల్‌ డ్యూటీ నుండి తొలగించింది.ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ మూడు మీడియా సంస్థలు సోమవారం కోర్టును ఆశ్రయించాయి. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని అవి కోరాయి. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనుంది. ీడియాపై విధించిన నిషేధాన్ని ట్రంప్‌ సమర్థించుకున్నారు. తనకు ప్రతికూలంగా ఉండే వార్తా కథనాలు దేశానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. కోర్టు వైట్‌హౌస్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే మీడియా సంస్థలను తిరిగి అనుమతిస్తారా అని ప్రశ్నించగా, సంబంధిత జడ్జి పక్ష‍పాతంతో వ్యవహరించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. 2017లో ట్రంప్‌ నియమించిన అమెరికా జిల్లా న్యాయమూర్తి తిమోతీ కెల్లీ 2018లో ఇలాంటి కేసులో సిఎన్ఎన్ జర్నలిస్టుకు వైట్‌హౌస్‌ ప్రవేశాన్ని పునరుద్ధరించాలని ఆదేశించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

మరోవైపు, సిఎన్‌ఎన్‌ను పూల్‌ కవరేజీ నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఇతర ప్రధాన టెలివిజన్‌ నెట్‌వర్క్‌లు దానికి ప్రత్యామ్నాయంగా పూల్‌ కవరేజీ నిర్వహించకూడదని నిర్ణయించాయి. అలాగే అసోసియేటెడ్‌ ప్రెస్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ సహా పలు సంస్థలు అధ్యక్ష కార్యక్రమాల ఫొటోలను ప్రచురించకుండా సంఘీభావం ప్రకటించాయి. ట్రంప్‌ చర్యలపై సిరక్యూస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మీడియా విశ్లేషకుడు రాబర్ట్‌ థాంప్సన్‌ స్పందిస్తూ, ప్రతికూల మీడియా కవరేజీని ‘‘ప్రమాదకరం’’గా పేర్కొనడం ఆందోళనకరమని అన్నారు. పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అంశంగా దీనిని ఆయన అభివర్ణించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్