బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైసిపి కి వలిరెడ్డి రాజీనామా

57 నిమిషాల క్రితం

Valireddy resigns from YCP.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 12:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు, జడ్పిటిసి పదవికి రాజీనామా


ప్రజాశక్తి-చీపురుపల్లి (విజయనగరం) : వైయస్సార్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు, జడ్పిటిసి పదవికీ వలి రెడ్డి శ్రీనివాస్ నాయుడు, జడ్పిటిసి వల్లిరెడ్డి శిరీష లు రాజీనామా చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న జడ్పిటిసి కార్యాలయంలో వారు స్థానిక విలేకరులతో బుధవారం మాట్లాడారు. తమ వ్యక్తిగత కారణాలవల్ల వైయస్సార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. 2013లో వైయస్సార్ పార్టీలో చేరిన తాము నేటి వరకు ప్రజాసేవలో కొనసాగామన్నారు. ఈ క్రమంలో 2013 నుండి 2025 వరకు వైయస్సార్ పార్టీ మండల అధ్యక్షుడు గాను, జిల్లా యూత్ ప్రెసిడెంట్ గాను, జిల్లా పార్టీ కార్యదర్శి గారు, ప్రస్తుతం వైయస్సార్ పార్టీ ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడిగా పని చేశామని వల్లి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా 2021 సెప్టెంబర్ నెలలో జడ్పిటిసి గా ఎన్నికైన తాను నేటి వరకు ప్రజలకు సేవ చేసానని జడ్పిటిసి వలిరెడ్డి శిరీష తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్