ఇక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా విద్యార్థులు, బోధన సిబ్బందికి ముఖ ఆధారిత హాజరు
యాప్ న మోదు లో అనంతపురం జే ఎన్ టియు కు మొదటి స్థానం
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య ఏపీ. శివకుమార్
ప్రజాశక్తి -అనంతపురం : రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు అనంతపురం జేఎన్టీయూ పరిధిలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో, ఫార్మసీ ఎంబీఏ, ఎంసీఏ కళాశాల లో ఇక నుంచి ముఖ ఆధారిత హాజరు (ఎఫ్ఆర్ఎస్ )అటెండెన్స్ ను అమలు చేస్తున్న విషయం విదితమే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల కంటే అనంతపురం జేఎన్టీయూ విద్యార్థులకు, బోధకులకు ముఖ ఆధారిత హాజరు నమోదు (ఎఫ్ ఆర్ ఎస్ ) యాప్ అనుసంధానం చేయడంలో ముందంజలో ఉన్నట్లు కో ఆర్డినేటర్, జేఎన్టీయూ పరీక్షల విభాగం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏపీ శివకుమార్ బుధవారం తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ రికార్డుల ప్రకారం .... అనంతరం జెఎఎన్ టియు పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో 1.77 లక్షలు మంది విద్యార్థులు, బోధన సిబ్బంది 16,788 మంది ఉన్నారు. వీరందరికీ కూడా ఆయా కళాశాలలో ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ ఐడి క్రియేట్ చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం నాటికి అటు విద్యార్థులు, బోధన సిబ్బందికి సంబంధించిన వేస్ రికగ్నిషన్ అటెండన్స్ ఐడిలను 70 శాతం వరకు క్రియేట్ చేసినట్లు ఆయన తెలిపారు. అనంతపురం జేఎన్టీయూ ఇందులో అగ్రభాగాన ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రతిరోజు కూడా విద్యార్థులు, బోధకులు ముఖ ఆధారిత హాజరు నమోదు పరిశీలించి అటు విద్యార్థుల హాజరు, బోధకుల హాజరును, సమయపాలన పారదర్శకంగా చేపట్టే చేపట్టడమే కాకుండా తరగతులు రెగ్యులర్ గా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యలో ఇటువంటి చర్యలు చేపట్టడం ద్వారా విద్యార్థులు హాజరు పెరగడం పాటు ఆయా సబ్జెక్టు పైన పరిణితి కూడా సాధించి భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే విద్యార్థులుగా తయారయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జెఎన్ టియు ఉపకులపతి ఆచార్య హెచ్ సుదర్శన్ రావు ముందుచూపు, సహకారం, తోడ్పాటు కారణంగా ఈ కార్యక్రమాన్ని తాము విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని ఆయన తెలిపారు.








కామెంట్‌లు (0)