ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

12, 13 తేదీల్లో సాంస్కృతిక ఉత్సవాలు

55 నిమిషాల క్రితం

12, 13 తేదీల్లో సాంస్కృతిక ఉత్సవాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 10:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుంటూరు : తెలుగు సాహిత్యాన్ని, కళల్ని, తెలుగు భాషను మరింత సజీవం చేయడంకోసం డిసెంబరు 12, 13 తేదీలలో విజయవాడలో మల్లెతీగ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు-2026 నిర్వహిస్తున్నట్లు కథా రచయిత కాట్రగడ్డ దయానంద్ తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్‌‌టిఆర్‌ ‌స్టేడియంలో రామరాజు ఫౌండేషన్ ఛైర్మన్ రామరాజు శ్రీనివాసరావు, ఇతర నిర్వాహకులతో కలసి జాతీయ సాంస్కృతిక ఉ త్సవాల పోస్టర్‌‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన కవుల్ని, రచయితల్ని, కార్టూనిస్టుల్ని, కళాకారుల్ని, ఫొటోగ్రాఫర్లని ఒక వేదికపైకి తీసుకురావాలన్న మల్లెతీగ గొప్ప సంకల్పానికి సౌజన్యం అందిస్తున్న ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. రామరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండ్రోజులపాటు సాహితీవేత్తలకు, సాంస్కృతిక సారధులకు గొప్ప వేదికను కల్పించడమే కాకుండా ఆయా రంగాల వారికి పోటీలు నిర్వహించి నగదు బహుమతులివ్వడం, సత్కరించడం తెలుగు సాహితీ కళారంగాలకు గొప్ప వరంగా భావిస్తున్నానన్నారు. సాహితీవేత్త కందిమళ్ళ శివ మాట్లాడుతూ కథ, కవిత, కార్టూన్, ఫొటోగ్రఫీ రంగాల్లో పోటీలు నిర్వహించి ఉత్తమ రచనల్ని రికార్డు చేస్తూ ఒక ప్రత్యేక సంచికను ఈ ఉ త్సవాల్లో ఆవిష్కరించబోతున్న ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థలను అభినందించారు. కార్యక్రమంలో మల్లెతీగ కలిమిశ్రీ ఉత్సవాల కమిటీ గుంటూరు జిల్లా బాధ్యులు బండికల్లు జమదగ్ని, సయ్యద్ జానీబాషా, ఏపీడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి. ఆంజనేయులు, రాజధాని వార్తలు ఎడిటర్ పి.హుస్సేన్ ఖాన్, ఉత్సవాల కమిటీ రాష్ట్ర నాయకులు చొప్పా రాఘవేంద్రశేఖర్, వై.డి. ఆనంద్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్