ఒంగోలు: మురసు తుఫాన్ ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకినట్లు అధికారులు వెల్లడించారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తీరాన్ని తాకిన తుఫాన్.. ఉదయం 6:30 గంటల నాటికి పూర్తిగా తీరం దాటుతుందని తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, సబ్‌స్టేషన్ల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం ఎక్కడా విద్యుత్ స్తంభాలు పడిపోలేదని, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదని విద్యుత్ శాఖ అధికారులు సీఎంకు వివరించారు.
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
నిన్న ఉదయం 8:30 గంటల నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో):
నాగులుప్పలపాడు (ప్రకాశం జిల్లా) – 198.01 మి.మీ.
కొత్తపట్నం – 182.25 మి.మీ.
బాపట్ల – 128.53 మి.మీ.
చీరాల – 124.10 మి.మీ.
త్రోవగుంట (ప్రకాశం జిల్లా) – 116.93 మి.మీ.
ఒంగోలు అర్బన్ – 106.97 మి.మీ.
చిలకపాడు – 104.50 మి.మీ.
సంతనూతలపాడు – 98.70 మి.మీ.
మొగల్తూరు (పశ్చిమ గోదావరి జిల్లా) – 96 మి.మీ.
మలికిపురం (కోనసీమ జిల్లా) – 93.70 మి.మీ.
తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సూచించిన భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచించింది.







కామెంట్‌లు (0)