మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్
Live News

ముంచెత్తిన 'మురసు' తుఫాన్

2 గంటల క్రితం

murasu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 07:54 పూర్వాహ్నం | 0 నిమిషాల చదవడం


Live Updates
23 minutes agoNov 03, 2026 09:40 AM IST

paddy

అంతులేని నష్టం మిగిల్చిన "అర్ణబ్"
మళ్లీ రైతుల ఉసురు తీసిన"మురసు"

ఆందోళనలో "అన్నదాతలు"

ప్రజాశక్తి-కడియం : వరుస తుఫాన్లు వరి రైతుల పుట్టి ముంచుతున్నాయి. బియ్యం ధరలు పైపైకి వెళ్తున్నా ధాన్యం ధరలు కిందనే ఉన్నాయి. అయినా వ్యవసాయానికి అలవాటు పడిన ప్రాణాలు మన రైతులు. కష్టమైనా నష్టమైనా వరి సాగుకు ముందుకు వస్తున్నారు. తాజా తుఫాన్లు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. అర్ణబ్ తుఫాను ప్రభావంతో భారీగా నష్టపోయిన రైతులకు ఇప్పుడు మురాసు వర్షాలు శాపంగా మారాయి. ఈదురు గాలులతో కూడిన అర్ణబ్ తుఫాన్ తో వరి చేలన్నీ నేలన పడకే సాయి. ధాన్యం కంకులు ఇప్పుడిప్పుడే పాలతో గింజలు కడుతుండగా , మురాసు తో కురుస్తున్న వర్షాలతో ముంపుకు గురై వరి చేలు పూర్తిగా కుళ్ళిపోయే పరిస్థితికి చేరువయ్యాయి.మురుగు నీరు వ్యవస్థ సరిగ్గా లేని కడియం ఆవ లాంటి ప్రాంతాల్లో రైతులు ఒక వరి కంకు కూడా ఇంటికి తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోతుంది. రైతన్నకు ఇంత భారీ నష్టం కలగడం బాధాకరమే.


about 1 hour agoNov 03, 2026 08:46 AM IST

మురసు తుపాను ప్రభావం – రెండు రైళ్ల దారి మళ్లింపు

మురసు తుపాను కారణంగా రైల్వే శాఖ రెండు రైళ్లను దారి మళ్లించింది.

1. రైలు నం. 12625: తిరువనంతపురం – న్యూఢిల్లీ (TVC–NDLS). నవంబర్ 2న బయలుదేరిన ఈ రైలును రేణిగుంట –యర్రగుంట్ల – న్యూ ఢిల్లీ – గుంటూరు – విజయవాడ (RU–YA–NDL–GNT–BZA) మార్గంలో దారి మళ్లించారు.

2. రైలు నం. 18638: SMVB – HTЕ. నవంబర్ 3న బయలుదేరిన ఈ రైలును కూడా రేణిగుంట – యర్రగుంట్ల – న్యూ ఢిల్లీ – గుంటూరు – విజయవాడ మార్గంలో దారి మళ్లించారు.

మార్పు: ఈ రెండు రైళ్లు సాధారణంగా ప్రయాణించే రేణిగుంట – గూడూరు – విజయవాడ (RU–GDR–BZA) మార్గాన్ని రద్దు చేశారు.

ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను సర్దుబాటు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

about 2 hours agoNov 03, 2026 08:21 AM IST

పలు రైలు నిలిపివేత

బాపట్ల: తుఫాను ప్రభావంతో బాపట్లజిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం.

బాపట్ల రైల్వేస్టేషన్ లో జైపూర్-చెన్నై, విశాఖ-చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపివేసిన రైల్వే అధికారులు

about 2 hours agoNov 03, 2026 08:14 AM IST

gnt

'మురసు' గాలులకు కూలిన చెట్టు

గుంటూరు : మురసు తుఫాను గాలులకు గుంటూరు - అమరావతి రహదారిలో 12/6 వద్ద కూలిన చెట్టు. చెట్టును తొలగించిన రహదారులు భవనాల శాఖ అధికారులు, సిబ్బంది.


జాగ్రత్తలు పాటించాలి : ప్రజలకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి

చిలకలూరిపేట : మురసు తుపాను ప్రభావంతో చిలకలూరిపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాం తాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం సూచించారు. తుపాను ప్రభావం కారణంగా చెట్లు కూలడం, విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినడం, విద్యుత్‌ వైర్లు తెగిపడటం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్ర జలకు ఎలాంటి ఇబ్బందులు కల గకుండా సంబంధిత అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉం డాలని, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారుల కు సూచించారు...ప్రజలు తీసు కోవాల్సిన జాగ్రత్తలు...భారీ వర్షాలు, ఈదురు గాలుల సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, చెట్ల కింద, విద్యుత్‌ స్తంభాల సమీపంలో నిలబడవద్దని ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. తెగిపడిన విద్యుత్‌ వైర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని, ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారు లకు సమాచారం అందించాలని కోరారు. చిలకలూరిపేట నియో జకవర్గ ప్రజలందరూ తుపాను తీవ్రత తగ్గే వరకు అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు పాటించాలని, తమ కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


about 2 hours agoNov 03, 2026 08:08 AM IST

మురసు

ముంపులో పలు కాలనీలు, మోకాళ్లతోతులో నిలిచిన నీరు

ప్రజాశక్తి-నరసాపురం: నరసాపురం పట్టణంలో మంగళవారం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా కుండపోతగా కురిసిన వర్షానికి పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా పట్టణంలోని నందమూరి కాలనీ, మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రహదారులపై మోకాళ్లతోతు నీరు వచ్చి చేరింది. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక ద్విచక్ర వాహనాలు నీటిలోనే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ నడవాల్సి వచ్చింది. సమగ్రమైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లే స్వల్ప వర్షానికే రోడ్లపై నీరు నిలిచిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని, రాకపోకలను పునరుద్ధరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్