
తెనాలిలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ
ప్రజాశక్తి-తెనాలి(గుంటూరు జిల్లా) : మున్సిపల్ ఎన్నికలలో తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ కేంద్రాలకు తరలించి ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. అయితే జోరు వర్షం కావడంతో విధులకు కేటాయించిన పోలింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తీవ్ర అవస్థలను ఎదుర్కొన్నారు. మహిళా సిబ్బంది పరిస్థితి వర్ణనాతీతం. ఒకే రౌండులో ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు జరిగాయి. మొత్తంగా 12 గంటల లోపే ఫలితాలు వెల్లడయ్యేయ్య అవకాశం ఉంది.

ఏలూరులో ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్
ప్రజాశక్తి ఏలూరు సిటీ: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం సర్ సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, నగరపాలక సంస్థ కమిషనర్ అన్నాప్రగడ భాను ప్రతాప్, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచారు. అనంతరం పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అధికారుల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని 62 డివిజన్ల కార్పొరేటర్ స్థానాలతో పాటు మేయర్ అభ్యర్థి భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మున్సిపల్ ఫలితాలపై బెట్టింగ్ జోరు
బహిరంగంగా చర్చించుకుంటున్న పట్టణ ప్రజానికం..
ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పురపాలక ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ పట్టణంలో బెట్టింగ్ వ్యవహారం బహిరంగంగా చర్చనీయాంశంగా మారింది.
పురపాలక పీఠం ఎవరిని వరిస్తుంది, ఏ వార్డులో ఎవరు గెలుస్తారు అనే అంశాలపై భారీ ఎత్తున పందేలు జరుగుతున్నట్లు స్థానికులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. లక్షల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నాయని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. పాలక పక్షం, ప్రతిపక్ష నాయకుల కంటే బెట్టింగ్ వేసిన వారే ఫలితాల కోసం మరింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని సమాచారం. మరికొన్ని గంటల్లో ఫలితాలు రానుండటంతో బెట్టింగ్ రాయుళ్లలో టెన్షన్ మొదలైంది. ఫలితాల అనంతరం వారి దశ, దిశ మారనుందని స్థానికంగా బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

నందిగామలో కౌంటింగ్ ప్రారంభం..
ఒకపక్క వాన.. మరోపక్క లెక్కింపు..
నందిగామ : నందిగామ పురపాలక ఎన్నికల గెలుపోటములు మరికొన్ని గంటల్లో తేలనున్నాయి. మంగళవారం ఉదయం కేవీఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎవరికి పట్టం కడతారో అన్న ఆసక్తి పట్టణమంతా నెలకొంది. అధికారులు పటిష్ట బందోబస్తు మధ్య లెక్కింపు చేపట్టారు. అయితే ఒకపక్క మురుసు తుపాను ప్రభావంతో జోరుగా కురుస్తున్న వాన.. మరోపక్క కొనసాగుతున్న లెక్కింపు ప్రక్రియతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉత్కంఠ నెలకొంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీల నాయకులు కళాశాల వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం లోపు అన్ని వార్డుల ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గెలుపు ఎవరిదో తేలే వరకు పట్టణంలో రాజకీయ వేడి రాజుకుంటోంది.
ఇంకా ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు
విజయవాడ, మచిలీపట్నం పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు.
కౌంటింగ్ ప్రక్రియను బహిష్కరించిన వైసిపి
కడప : జమ్మలమడుగు, పులివెందులలో కౌంటింగ్ ప్రక్రియను బహిష్కరించిన వైసిపి. కౌంటింగ్ ప్రక్రియకు దూరంగా వైసిపి చైర్ పర్సన్ అభ్యర్థి ప్రమీలమ్మ.
శ్రీ సత్యసాయి జిల్లా:
- హిందూపురం పాలిటెక్నికల్ కళాశాలలో ప్రారంభమైన మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ.
- మొత్తం 52 వార్డులు ఉండగా అందులో 7, 11 వార్డ్ కౌన్సిలర్లు ఏకిగ్రీవ ఎన్నికయ్యారు. మిగిలిన 50 వార్డ్ లు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాయి.
- హిందూపురం మున్సిపాలిటీ కౌంటింగ్ సందర్భంగా పట్టణంలో 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందన్నరు డిఎస్పి రవిబాబు
- గెలుపొందిన అభ్యర్థులు ఎవరూ కూడా టపాసులు పేల్చి, ర్యాలీలు నిర్వహించడం నిషేధమన్నారు.
- ఎలాంటి సంబరాలకు ఆస్కారం లేదన్న డి.ఎస్.పి రవిబాబు
కౌంటింగ్ కేంద్రం తాళాలు మిస్సింగ్
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కౌంటింగ్ కేంద్రం తాళాలు కనిపించకపోవడంతో అధికారులు తాళాలను పగలగొట్టారు. పార్వతిపురం మన్యం జిల్లాలో కూడా స్ట్రాంగ్ రూమ్ తాళాలు మాయమయ్యాయి.
టిడిపి, జనసేనల మధ్య వాగ్వివాదం
పుంగునూరు 9వ వార్డులో ఓట్ల లెక్కింపులో టిడిపికి చల్లని ఓట్లు లెక్కించారని జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వివాదం నెలకొంది.
విశాఖపట్నం :
* ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ
* ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
* కౌంటింగ్ కోసం ఏయూ నార్త్ క్యాంపస్‌లో 8 బ్లాకులు, సౌత్ క్యాంపస్‌లో 2 బ్లాకుల ఏర్పాటు
* మొత్తం 113 కౌంటింగ్ హాళ్లు, 1,507 కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు
* ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 5,000 మంది సిబ్బంది నియామకం
* పోస్టల్ బ్యాలెట్లతో సహా ఓట్ల లెక్కింపు ప్రారంభం.. నాలుగు వార్డుల్లో పూర్తి
* గరిష్టంగా రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేసేలా ఏర్పాట్లు
* అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో ఉదయం 6 గంటలకు స్ట్రాంగ్ రూములు తెరిచిన అధికారులు
* కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహణకు ప్రత్యేక చర్యలు
* కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతో పటిష్ట పోలీసు బందోబస్తు
* కౌంటింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్, సీపీ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
* ప్రతి వార్డు కౌంటింగ్ పూర్తయిన వెంటనే వార్డు సభ్యుల ఫలితాల ప్రకటన
* అన్ని వార్డుల కౌంటింగ్ పూర్తయిన అనంతరం మేయర్ ఎన్నిక తుది ఫలితాల ప్రకటన
8.30 గంటలకు ట్రెండింగ్...
* పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ 4 వార్డుల్లో ఇప్పటికి పూర్తి
* 23, 43, 56, 89 వార్డుల్లో పూర్తి
* 8.50కి మేయర్ మొత్తం ఓట్లు.. తేదేపా 53, వైకాపా 29, కాంగ్రెస్ 2, ఇతరులు 31
* వార్డుల్లో తేదేపా 8, వైకాపా 5, జనసేన 2, బీజేపీ 1, స్వతంత్ర 1 లీడింగ్ లో ఉన్నాయి.

జోరువానలో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్
అమలాపురం : అమలాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో 19 ఓట్లు రాగా, కూటమి అభ్యర్థి నల్లా శ్రీధర్ కు 16, వైసీపీ అభ్యర్థి దూడల విరీతాదేవి 3 ఓట్లు పోలయ్యాయి.
10:30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమీక్ష
ఉదయం 10:30 గంటలకు వాతావరణ పరిస్థితిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాలు తగ్గకపోతే ప్రకాశం , బాపట్ల జిల్లాలో ఓట్ల లెక్కింపుపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
చిత్తూరులో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
చిత్తూరు జిల్లాలోని పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ ముందంజ ఉంది. టీడీపీ చైర్మన్ అభ్యర్థి రాజకుమార్ కు 15 ఓట్లు, టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు 8 ఓట్లు పొందారు. 11వ, 16వ వార్డులకు ఒక్కో ఓటు, 27వ వార్డు, 31వ వార్డు మూడేసి ఓట్లు ఖాతాలో చేరాయి .

కౌంటింగ్ వాయిదా వేస్తే వచ్చే నష్టమేంటి? : పేర్ని నాని సూటి ప్రశ్న
ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్: భారీ వర్షాలు, ఈడ్చి కొడుతున్న ఈదురుగాలుల లో కౌంటింగ్ జరపడం అవసరమా? వాయిదా వేస్తే వచ్చే నష్టం ఏంటని కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ఎలియాస్ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి తుఫాన్లో డీఐజీ బయటకు వస్తున్నారా ? డీజీపీ బయటకు వస్తున్నారా? వాళ్లేమో భద్రంగా భవంతుల్లో కూర్చుని పోలింగ్ సిబ్బంది, పోలీస్ అధికారులు, కానిస్టేబుల్ తదితర సిబ్బందిని తుఫాన్ బీభత్సానికి బలి పశువులుగా మారుస్తారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మార్గమధ్యలో ఏ చెట్టు ఇరిగి మీద పడి ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. మంగళవారం ఉదయం కృష్ణ యూనివర్సిటీ కౌంటింగ్ హాల్లోకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో మాట్లాడానని, పోలింగ్ ఏజెంట్లు అందరూ వచ్చిన తర్వాతే కౌంటింగ్ మొదలు పెట్టాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశామన్నారు. వాస్తవానికి కౌంటింగ్ ఉదయం ఏడు గంటలకు మొదలు కావలసి ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల ఆలస్యం అయింది.
ఓట్ల లెక్కింపు ప్రారంభం ఆలస్యం
అమరావతి : 13 కార్పొరేషన్ లో, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తుఫాను ప్రభావం వల్ల ప్రకాశం, బాపట్ల జిల్లాలలో కౌంటింగ్ ఆలస్యంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఉదయం 11:30 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. రేపల్లెలో కూడా ఓట్ల లెక్కింపు ఆలస్యంగా మొదలవుతుందని అధికారులు పేర్కొన్నారు.

విజయనగరం : విజయనగరం జిల్లాలో ప్రారంభమైన నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపునకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఓట్ల లెక్కింపుపై 'మురసు' ప్రభావం
- చీరాలలో కౌంటింగ్ ప్రారంభం ఆలస్యం
చీరాల: మురసు తుఫాను ప్రభావం, పరిస్థితుల దృష్ట్యా ప్రకాశం జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ది. 03.11.2026 న ఉదయం 8 గంటలకు, చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభం చేయాల్సిన, చీరాల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ను ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని, ఈ రోజు ఉదయం 11 గం.ల తరువాత ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. కౌంటింగ్ నకు సంబంధించిన తదుపరి సమాచారం ఉదయం 9 గంటలకు మరలా తెలియపరుస్తామని పేర్కొన్నారు.
ప్రజాశక్తి-నరసాపురం: నరసాపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక శ్రీ వైఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో మరికొద్ది నిమిషాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రం వద్దకు అభ్యర్థులు, వారి ప్రధాన ఏజెంట్లు భారీగా చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, సిబ్బంది అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టారు. భద్రతా నిబంధనల ప్రకారం కౌంటింగ్ హాల్‌లోకి మొబైల్ ఫోన్ల అనుమతిని పూర్తిగా నిరాకరించారు. కౌంటింగ్ కేంద్రం వెలుపల భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లోనే అభ్యర్థుల భాగ్యరేఖలు తేలనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







కామెంట్‌లు (0)