- యుటిఎఫ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పెండింగ్ డిఎ అరియర్స్ బిల్లులు సబ్‌మిట్ చేసేందుకు నిధి పోర్టల్‌లో అవకాశం ఇవ్వాలని యుటిఎఫ్ రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ 2018 జులై నుంచి 2026 వరకు విడుదల చేసిన డిఎలకు సంబంధించి అరియర్ బిల్లు పెట్టుకోవడానికి సిఎఫ్‌ఎంఎస్‌లో టైల్స్ ఓపెన్ చేయకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కాబట్టి బకాయిలు చెల్లించేందుకు కావాల్సిన సిఎఫ్‌ఎంఎస్ టైల్స్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఎన్‌క్యాష్‌మెంట్ ఎరండలీవు, గ్రాట్యూటీ బకాయిలు చెల్లించేందుకు కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షులు కె శ్రీనివాసరావు, సహాధ్యక్షులు ఎఎన్ కుసుమకుమారి,కోశాధికారి రెడ్డి మోహనరావు, కార్యదర్శులు బి లక్ష్మిరాజా, ఎస్ మురళీమోహనరావు, ఎస్పి మనోహర్ కుమార్, ఎస్‌ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
జోన్‌ల్ పోస్టులుగా హెచ్‌ఎం పోస్టుల మార్పుపై హర్షం
పాఠశాల విద్యలో జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను జోనల్ పోస్టులుగా మార్చినందుకు యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్ ప్రసాద్ మరో ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఎపి పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025(రాష్ట్రపతి ఉత్తర్వులు 2025)అనుసరించి జోనల్ క్యాడర్‌గా మారస్తూ జివో 202ను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. విద్యాశాఖ సమర్పించిన ప్రతిపాదనలు అనుసరించి ప్రభుత్వం ఎంపిపి, జెడ్‌పి పాఠశాల్లోని వివిధ తరగతుల పోస్టులను జిల్లా క్యాడర్, జోనల్ క్యాడర్ పోస్టులుగా వర్తీకరిస్తూ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఇకపై నియామకాలు, రిక్రూట్‌మెంట్, సీనియార్టీ, ప్రమోషన్లు, బదిలీలు తదితర సర్వీస్ అంశాలన్నిటికీ వర్తిస్తాయని తెలిపారు.








కామెంట్‌లు (0)