సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘మైసా’గా రష్మిక.. యాక్షన్‌ అవతారంలో అదుర్స్‌

54 నిమిషాల క్రితం

mysaa-3e8b51e0-e234-11f0-865b-e94d451116fd.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 08:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మైసా’ టీజర్‌ విడుదలైంది. ఇందులో రష్మిక యాక్షన్‌ అవతారంలో కనిపించారు. రక్తంతో తడిసిన ముఖం, చేతిలో ఆయుధాలతో ఆమె చేసిన పోరాట సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

“యుద్ధానికి ఆయుధం అంటే భయం కానీ.. ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు” అనే డైలాగ్‌ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. అడవి, గిరిజన ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్‌ ఫార్ములా ఫిల్మ్స్‌ బ్యానర్‌పై అనిల్‌, అజయ్‌ సయ్యాపురెడ్డి నిర్మిస్తున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌, రావు రమేష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్‌ 27, 2026న సినిమా విడుదల కానుంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్