ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి డిసెంబర్ 2వ తేదిన నిర్వహించనున్న స్ర్కీనింగ్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎపిపిఎస్సి) వాయిదా వేసింది. అన్ని యూనివర్సిటీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ(ఆర్‌జియుకెటి)లోని లెక్చరర్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను కూడా డిసెంబర్ 1 నుంచి 5వ తేది వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఎపిపిఎస్సి ముందుగా ప్రకటించింది. అయితే కొన్ని పరిపాలన కారణాల రీత్యా డిసెంబర్ 2వ తేదిన జరగాల్సిన పరీక్షను డిసెంబర్ 9వ తేదికి వాయిదా వేస్తునట్లు ఎపిపిఎస్సి కార్యదర్శి రవిసుభాష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన తేదీల్లోని పరీక్షలు యధాతధంగా జరుగుతాయని వెల్లడించారు.
డిసెంబర్ 2 ‘ప్రొఫెసర్’ పరీక్ష వాయిదా
13 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026, 08:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)