ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేసి రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కమిషన్ ఛైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్ర శుక్రవారం కలిసి ఇందుకు సంబంధించిన నివేదికను అందజేశారు. నివేదికలో ముఖ్యమైన అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వం తరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిభందనల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం డెడికేటెడ్ కమిషనన్ ను నియమించింది. 6 నెలలపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి కమిషన్ స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించి, ఆ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితి, జనాభా, రాజకీయ ప్రాతినిథ్యంపై సమగ్ర అధ్యయనం చేసిన, క్షత్ర స్థాయిలో సచివాలయ సిబ్బంది నిర్వహించిన యునిఫైడ్ ఫ్యామిలీ సర్వే వివరాలను ఆధారంగా చేసుకుని కమిన్ తన నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో ప్రధానంగా స్థానికంగానే బలహీన వర్గాలకు (బిసి)లకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కమిటీ ప్రధానంగా సూచించినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించిన డెడికేటెడ్ కమిషన్
14 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 12:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)