అమరావతి : ఎపి సిఎం చంద్రబాబుతో డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ శుక్రవారం మరోసారి భేటీ అయ్యారు. పలుచోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముఖ్యమంత్రి ఇంటికి పవన్ చేరుకుని ప్రత్యేక సమావేశమయ్యారు. నామినేషన్ల గడువు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో .... కూటమి సీట్ల సర్దుబాటుపై సుమారు అరగంటసేపు వీరిద్దరూ చర్చించారు. టిడిపి, జనసేన, బిజెపి లోని ఆశావహులు తమకు అవకాశం ఉన్న చోట్ల పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో ఆయా చోట్ల ఏకాభిప్రాయం సాధించే అంశంపై చంద్రబాబు, పవన్ చర్చించారు. నిన్న కూడా సిఎం తో పవన్ సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చించిన సంగతి విదితమే.
సిఎం చంద్రబాబుతో మరోసారి డిప్యూటి సిఎం పవన్ భేటీ
31 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 23, 2026, 12:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)