వడ్డేశ్వరం (గుంటూరు) : సర్ ను రద్దు చేయాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ... శుక్రవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనల్లో (అక్టోబర్ 23న) భాగంగా వడ్డేశ్వరం బైపాస్ రోడ్డు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రమాదేవి, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కె.ఆంజనేయులు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కేశవరావు తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)