శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చంటిబిడ్డతో వచ్చి గిరిజన మహిళ నామినేషన్

34 నిమిషాల క్రితం

Tribal woman files nomination while carrying her infant
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 12:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : మక్కువ స్థానిక సంస్థల ఎన్నికల్లో చివరి రోజున నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం బిఎస్పి అభ్యర్థిగా కవిరిపల్లి ఎంపీటీసీ స్థానానికి చంటి బిడ్డ నెత్తుకుని వచ్చిన గిరిజన మహిళ కొండతామర కామిని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ వేశారు. మండలంలోని కవిరిపిల్లి ఎంపీటీసీ స్థానం ఎస్టీ మహిళలకు కేటాయించారు. దీంతో బిఎస్పి పార్టీ తరఫున కొండతామర కామిని ఈరోజు నామినేషన్ వేశారు. ఇదిలా ఉండగా స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి సుమారు 100 మీటర్ల దూరంలో పోలీసులు ఎటువంటి ర్యాలీలను అనుమతించలేదు. వైసిపి అభ్యర్థులు ర్యాలీగా వస్తున్నప్పుడు పోలీసులు అక్కడే నిలిపివేశారు. ఒక అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే నామినేషన్ కేంద్రానికి వెళ్లేందుకు అనుమతించారు. అన్ని పార్టీలకు ఇండిపెండెంట్ లకు ఇదే విధంగా పోలీసులు నిబంధనలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్ చివరి రోజు కొనసాగుతుంది.
01

02

03

04

రావుపల్లి సెగ్మెంట్ కి సంబంధించి జనసేన అభ్యర్థి తరపున పాల్గొన్న కళాకారులు .

రావుపల్లి సెగ్మెంట్ కి సంబంధించి జనసేన అభ్యర్థి తరపున పాల్గొన్న కళాకారులు .


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్