శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'కియా’ విస్తరణతో అభివృద్ధి, ఉద్యోగాలు

27 నిమిషాల క్రితం

savitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 06:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : విశాఖ సీఐఐ సమ్మిట్ సందర్భంగా కూటమి ప్రభుత్వంతో కియా ప్లాంట్ విస్తరణ ఒప్పందం చేసుకోవడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. కార్ల పరిశ్రమ విస్తరణ ఒప్పందంతో పెనుకొండ పట్టణం సహా చుట్ట పక్కలప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా 12 వేల మందికి పైగా యువతకు కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖలో జరుగుతున్న విశాఖ సీఐఐ సమ్మిట్ - 2026కు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. విశాఖ సమ్మిట్ సందర్భంగా తొలిరోజు రూ.5.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రెండో రోజూ కూడా ప్రఖ్యాత గాంచిన సంస్థలు కూటమి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యం రూ.11 వేల లక్షల కోట్ల కంటే అదనంగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు.ముఖ్యంగా, పెనుకొండలో ఉన్న కియా కార్ల పరిశ్రమ విస్తరణకు ఆ సంస్థ యాజమాన్యం ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. రూ.17 వేల కోట్లతో రెండు లక్షల కార్ల ఉత్పత్తులే లక్ష్యంగా కియా యాజమాన్యం ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఒప్పందంతో కొత్తగా 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. కియా పరిశ్రమ రాకతో పెనుకొండ రూపురేఖలే మారి పోయాయన్నారు. ఇప్పుడా ప్లాంట్ విస్తరణ పనులు కూడా ప్రారంభమైతే..ఆ సంస్థ నుంచి సీఎస్ఆర్ ఫండ్స్ మరింతగా వచ్చే అవకాశముందన్నారు. దీనివల్ల పెనుకొండ పట్టణంతో పాటు చుట్ట పక్కల గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు వీలుకలుగుతుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కియా పరిశ్రమ ఏర్పాటయిందని, 13 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించాయన్నారు. ఇపుడు కొత్త ఒప్పందం కారణంలో మరో 12 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనుండడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. కియా విస్తరణ పనులకు పచ్చజెండా ఊపిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్, కార్ల పరిశ్రమ యాజమాన్యానికి మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్