నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దర్శకుడు రవిబాబు ఓ హారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'స్కేరీ పిక్చర్' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను రానా దగ్గుబాటి నిర్మిస్తున్నారు. శుక్రవారం సినిమా టైటిల్ టీజర్‌ను రానా సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా 2027లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంతో రవిబాబు హిందీ చిత్ర పరిశ్రమలోకి దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగు పోస్టర్ విడుదల కాకపోవడంతో సినిమా హిందీలో మాత్రమే తెరకెక్కుతోందా, లేక ఇతర భాషల్లోనూ విడుదల కానుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
‘స్కేరీ పిక్చర్’తో బాలీవుడ్‌కు రవిబాబు
16 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026, 06:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)