గువహటి : అస్సాంలో ఘోర ప్రమాదం జరిగింది. కజిరంగా నేషనల్ పార్క్ సమీపంలో శుక్రవారం మినీ బస్సు, కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 23 మంది మరణించగా, మరో 20మందికి గాయాలైనట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మృతులంతా కాలేజీ విద్యార్థులని, మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని అన్నారు. వివరాల ప్రకారం.. జాతీయ రహదారి 715పై కొహోరా పరిధిలోని హతికులి టీ ఎస్టేట్ సమీపంలో ఉన్న రంగజన్ వద్ద ప్రయాణికుల మినీ బస్సు ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైందని, దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని అన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. సహాయక చర్యలు చేపడుతున్నట్లు గోల్ఘాట్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తెలిపారు. అతివేగం, బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అస్సాం పంచాయితీ, గ్రామీణాభివృద్ధి మంత్రి అతుల్ బోరా పేర్కొన్నారు.
అస్సాంలో ఘోర ప్రమాదం.. 23 మంది మృతి
27 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026, 06:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)