శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిర్మాతగా నందమూరి తేజస్విని

50 నిమిషాల క్రితం

balayya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 05:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని నిర్మాతగా మారుతున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభు’ చిత్ర నిర్మాత భువన్, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది. నిర్మాతగా ఉన్న భువన్, ఒక కొత్త, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో కూడిన కథను సిద్ధం చేశారట. ఆ కథ తేజస్వినికి నచ్చడంతో, వెంటనే ఈ సినిమాను నిర్మించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెలలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కొన్ని కీలక సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమాలో అన్వేష్ హీరోగా, ప్ర‌ముఖ న‌టుడు బాబీ సింహా కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. హీరోయిన్‌, ఇతర నటీనటుల వివరాలను సినిమా ప్రారంభోత్సవం రోజున ప్రకటించనున్నారు.

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్