ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుదలకు సంబంధించిన 12వ వేతన సవరణ సంఘం చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పిఆర్సి చైర్మన్ గా ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు.1983 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఈనెల 1వ తేదీన దినేష్ కుమార్ చైర్మన్ గా 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది లోగా పిఆర్సి నివేదికు సమర్పించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపధ్యంలో ఆయన పిఆర్సి చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. పిఆర్సి చైర్మన్‌గా రాష్ట్రంలో గల అన్ని ప్రభుత్వ శాఖల నుండి సమాచారాన్ని తీసుకోవడంతో ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నుండి పూర్తి వివరాలు సేకరించి పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తదుపరి వేతనాల పెంపుదలకు సంబంధించి ఏడాది గడువులోగా పిఆర్సి నివేదికను రూపొందించనున్నారు. పిఆర్సి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దినేష్ కుమార్‌ను రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్, అదనపు కార్యదర్శి గౌతమ్ అల్లాడలు కలిసి పుష్పగుచ్చం అందించి శుభా కాంక్షలు తెలిపారు. అదే విధంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ, సంఘం ప్రతినిధులు దినేష్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
12వ పిఆర్సి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దినేష్ కుమార్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026, 09:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)