గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎయిడ్స్ నివారణలో జిల్లాలో ప్రథమ స్థానం : జిల్లా అధికారి

1 గంట క్రితం

kakinada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 02:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కోటనందూరు : ఎయిడ్స్ నివారణలో రాష్ట్రంలో కాకినాడ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా లెప్రసీ,ఎయిడ్స్ ,టీబీ వైద్యాధికారి ఎస్. చలమయ్య అన్నారు. గురువారం నాడు మండల కేంద్రమైన కోటనందూరు లో ఉన్న ప్రాథమిక వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆసుపత్రిలో రికార్డులను తనిఖీ చేసి వైద్య సిబ్బందితో మాట్లాడి, వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్ నివారణకు మందులు పుష్కలంగా ఉన్నాయని, ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచడంతో వ్యాధుల నివారణ అదుపులో ఉందని అన్నారు. మందుల షాపుల్లో అనుమతులు లేకుండా లెప్రసీ, ఎయిడ్స్, టీబి వ్యాధులకు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మందుల షాపుకు అనుమతించిన సర్టిఫికెట్ కలిగిన వ్యక్తులు మాత్రమే మందులను విక్రయించాలని అన్నారు. ఆగస్టు 12వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు జిల్లాలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు. వైద్య శిబిరాలును రోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరక్షరాశులకు ఈ వ్యాధులు సోక కుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. స్థానిక ప్రాథమిక అధికారులు యామిని, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్