గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లెప్రసి కేసుల గుర్తింపు : డాక్టర్ కిరణ్మయి

1 గంట క్రితం

west g
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 03:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గణపవరం : గణపవరం ప్రాదిమిక ఆరోగ్యకేంద్రం పరిదిలో గల గ్రామాల్లో ఈనెల11 నుండి 24 వరకు లెప్రసి కేసులను గుర్తించనున్నట్లు పిహెచ్ సి డాక్టర్ పి కిరణ్మయి గురువారం వెల్లడించారు. స్థానిక ఆసుపత్రిలో వైద్యసిబ్బంది కి లెప్రసి క్రొత్త కేసులు గుర్తించడానికి శిక్షణ ఇస్తున్నట్లుచెప్పారు. గ్రామాల్లో ఎవరికైనా స్పర్స లేని మచ్చలు, తిమ్మిర్లు ,మచ్చలపై వెంట్రుకలు రాలిపోవటం, చెమట పట్టని మచ్చలు, పాదాలనుండి చెప్పులు జారిపోవటం లక్షణాలను గుర్తిస్తే వెంటనే వారిని స్థానిక ఆరోగ్య కేంద్రానికి పంపాలని సిబ్బందికి చెప్పారు. ఈకార్యక్రమంలో సిహెచ్ ఒ జాలాది విల్సన్ బాబు, పీ హెచ్ ఎన్ సి హెచ్చ్ వి సత్యవతి, హెచ్చ్ వి పద్మజ, ఎం ఎల్ హెచ్ పిలు, ఏ ఎన్ ఎం లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్