లక్నో : తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ బాధ్యతల నుండి పూర్తిగా తొలగించినట్లు బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి గురువారం ప్రకటించారు. తన మామ, మాజీ రాజ్యసభ సభ్యుడు అశోక్ సిద్ధార్థ రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కొద్ది సేపటికే మాయావతి ఈ ప్రకటన చేశారు. ఆకాష్ ఆనంద్‌ను పార్టీ బాధ్యతల నుండి పూర్తి విముక్తిడిని చేసినట్లు ఆమె ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు. ఇటీవల లక్నోలో జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల జాతీయ స్థాయి సమావేశంలో ఆకాష్ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్త పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆకాష్ ఇంకా రాజకీయ పరిణతి సాధించాల్సి వుందని, అప్పుడే పార్టీలో అతిపెద్ద బాధ్యతలు చేపట్టేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు. తన రాజకీయ, పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ద్వంద్వ మనస్తత్వంతో ఉన్న ఆకాష్ పార్టీలో సమర్థవంతంగా పనిచేయలేరని అన్నారు. బిఎస్‌పి, పార్టీ ఉద్యమం కంటే కుటుంబ బంధాలకే ఆకాష్ ఆనంద్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే ఆమె గతంలో చేసిన 'ఎక్స్' పోస్ట్‌ను ఆయన రీపోస్ట్ చేయలేదని మాయావతి అన్నారు. జాతీయ సమన్వయకర్త పదవికి సంబంధించిన అన్ని కీలక బాధ్యతల నుండి ఆయనను ఎలాగైతే తప్పించారో, అలాగే ఇప్పుడు కూడా ఆయనను పార్టీ నుండి పూర్తిగా విముక్తుడిని చేయాలని పార్టీలోని వారు భావిస్తున్నారని అన్నారు. ఆకాష్ ఆనంద్ పార్టీలో స్వతంత్రంగా ఉండాలనుకుంటే అందుకు ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉందని, ఆయనను ఇప్పుడు పార్టీ నుండి పూర్తిగా విముక్తుడిని చేశామని తాజా ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మాజీ ఎంపి అశోక్ సిద్ధార్థ రాజకీయ విరమణపై స్పందిస్తూ.. చాలా ఆలస్యంగా తీసుకున్నప్పటికీ.. సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
ఆకాష్ ఆనంద్‌ను పార్టీ బాధ్యతల నుండి పూర్తిగా తొలగించాం : మాయావతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 03:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)