మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition2,721 పోస్టులతో డిఎస్‌‌సి నోటిఫికేషన్

1 గంట క్రితం

ap dsc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 11:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ నియామకాల కోసం 2,721 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. సాధారణ పాఠశాలల్లో 2,111 పోస్టులు, ప్రత్యేక విద్య విభాగంలో 350 పోస్టులు, వివిధ సొసైటీల పరిధిలో 260 పోస్టులను భర్తీ చేయనున్నారు. సాధారణ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 906, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 1,205 ఉన్నాయి. ప్రత్యేక విద్య విభాగంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 150, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 200 ఉన్నాయి. పూర్తి ప్రకటన నవంబరు 3లోపు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల కానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన పాఠ్యప్రణాళిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రకటించిన ఖాళీలు తాత్కాలికమైనవని, తుది ఖాళీలు, రోస్టర్‌ వివరాలను పూర్తి ప్రకటనలో వెల్లడిస్తామని విద్యాశాఖ తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్