ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గొరిగిండ్ల సర్పంచ్ మక్కినేని జ్యోతి, సునీల్ చౌదరిని చర్చి ఫాదర్ సన్మానం

1 గంట క్రితం

Church Father honors Gorigindla Sarpanch Makkineni Jyothi and Sunil Chowdary
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 05:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆత్మకూరు (అనంతపురం) : గోరిదిండ్ల నూతన పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన మక్కినేని జ్యోతిని ఆదివారం గ్రామంలో చర్చిలో క్రిస్టియన్స్ ఫాదర్, స్థానిక ప్రజలు టిడిపి నాయకులు కార్యకర్తలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో సర్పంచ్ గెలిపించిన గోరిదిండ్ల, డీకే తండా గ్రామ ప్రజలకు కృషి చేసిన టిడిపి నాయకులకు కార్యకర్తలకు కూడా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గొరిగిండ్ల సర్పంచ్ మక్కినేని జ్యోతి మాట్లాడుతూ .... ఈ గొరిగిండ్ల పంచాయతీ ప్రజలు ఎలాంటి సమస్య వచ్చినా వాటిని తక్షణమే పరిష్కారం చేస్తానని గ్రామంలో వీధి లైట్లు పారిశుధ్యం మంచినీటి సౌకర్యం ఇలాంటి సమస్య లేకుండా పరిష్కారం చూపుతానని గోరి దిండ్ల పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఆమె తెలిపారు. తనపై నమ్మకం ఉంచి మంచి మెజార్టీతో గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్