ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జమ్ముకాశ్మీర్‌లో స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు

2 గంటల క్రితం

Srinagar.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 04:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌ ప్రజలకు చలి నుంచి స్వల్ప ఉపశమనం లభించింది. శ్రీనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగాయి. ఆదివారం శ్రీనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్‌ 2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి ఇది మైనస్‌ 2.4 డిగ్రీలుగా నమోదవగా, ఈ సీజన్‌లో వరుసగా ఐదోసారి అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు లోయలోని పలు ప్రాంతాలు దట్టమైన మంచు కమ్మేసింది.

కశ్మీర్‌లో అత్యంత చల్లని ప్రాంతంగా పెహల్గాం నిలిచింది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత మైనస్‌ 3.4 డిగ్రీలుగా నమోదైంది. శనివారం రాత్రి నమోదైన మైనస్‌ 3.2 డిగ్రీలతో పోలిస్తే ఇక్కడ చలి స్వల్పంగా పెరిగింది. దక్షిణ కశ్మీర్‌లోని ఖాజీగుండ్‌లో మైనస్‌ 2 డిగ్రీలు, ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారాలో మైనస్‌ 1.4 డిగ్రీలు నమోదయ్యాయి. పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్‌లో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలుగా నమోదైంది. వచ్చే వారం రోజుల్లో జమ్ముకాశ్మీర్‌లో వర్షాలు లేదా భారీగా మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్