అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కీలకమైన ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్‌తో పాటు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో భాగంగా రాయపూడి నుంచి వెంకటపాలెం, పెనుమాక మీదుగా ఉండవల్లి వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రాజధాని ప్రాంతంలోని కీలక ప్రాంతాలను అనుసంధానించే ఈ రహదారి అందుబాటులోకి రావడంతో ప్రజలు, వాహనదారులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని మొత్తం రూ.1,519 కోట్ల వ్యయంతో చేపట్టారు. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు స్టీల్ బ్రిడ్జిలను కాలినడకన పరిశీలించి, నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో గురువారం నుంచి ఈ మార్గంలో పూర్తి స్థాయిలో వాహన రాకపోకలకు మార్గం సుగమమైంది. ప్రారంభ కార్యక్రమానికి రైతులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అమరావతిలో ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం
13 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 12:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)