బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.2 వేల కోట్ల భూమిని జప్తు నుంచి కాపాడేందుకు కృషి

15 గంటల క్రితం

rrr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 06:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్ రఘురామ కృష్ణరాజు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో దాదాపు రూ.2 వేలకోట్లు విలువ చేసే 174.43 ఎకరాల భూమిని బ్యాంకుల జప్తు నుంచి కాపాడేందుకు కృషి చేస్తామని అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్ రఘురామ కృష్ణరాజు తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన అధ్యక్షతన ఫిర్యాదుల కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ప్రైవేటు సంస్థకు పరిశ్రమ నెలకొల్పేందుకు 1981లో రాష్ట్ర ప్రభుత్వం 174.43 ఎకరాల భూమిని కేటాయించగా, ఆ సంస్థ దివాలా తీయడంతో ప్రస్తుతం ఆ భూమి జప్తునకు గురయ్యే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. దీనిపై ఆగస్టు మొదటి వారంలో ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో మరోసారి ఫిర్యాదుల కమిటీ సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కమిటీ సభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సంస్థ దివాలా తీయడంతో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విలువైన భూములు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్‌కు భూములిచ్చిన వారి పునరావాసం కోసం ఇచ్చిన ఆర్-కార్డులకు సంబంధించి 1,203 మందికి రెగ్యులరైజేషన్ పెండింగ్‌లో ఉంచారని, వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యలు కొణతాల రామకృష్ణ, గురజాల జగన్‌మోహన్, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్