శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition36 వేల మంది పోలీససులతో ఎన్నికల బందోబస్తు

2 గంటల క్రితం

36 వేల మంది పోలీససులతో ఎన్నికల బందోబస్తు
-డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 10:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 4,372 ప్రాంతాల్లో 36,351 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిజిపి హరీష్‌ ‌కుమార్‌ ‌గుప్తా తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఈనెల15 నుంచి 29 వరకు 261 కేసులు నమోదు చేసి 107 మందిని అరెస్ట్ చేయగా, 733 మందికి నోటీసులు జారీ చేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 19,993 మందిపై పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. 1,05,767 మందిని బైండోవర్ చేశామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 2,726 నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేశామనిపేర్కొన్నారు. తనిఖీల్లో రూ.4.91 లక్షల నగదు, రూ.11.99 లక్షల విలువైన మద్యం, 114.1 లీటర్ల నాటుసారా, రూ.2.94 కోట్ల విలువైన 495.987 కిలోల గంజాయి, రూ.1.49 లక్షల విలువైన బాణసంచా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, సామగ్రి పంపిణీ, బ్యాలెట్ పెట్టెల భద్రతపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, హింసకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

​

​

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్