ఎంఒయు జరిగిన ప్రతి ఎనర్జీ ప్రాజెక్టు గ్రౌండ్ అవ్వాలి
విద్యుత్ అవసరాలకు ప్రైవేట్ సెక్టార్‌పై ఆధారపడటం తగ్గించాలి
పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టుల వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు
విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్ అంచనా వేసి తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించి తక్షణం వాటిని అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. విద్యుత్ రంగంపై ఆ శాఖ అధికారులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే 6 నెలల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌నినో వంటి సమస్యల కారణంగా వర్షాకాలంలో కూడా విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని, ఇలాంటి సవాళ్లను ముందుగానే అంచనా వేసుకుని ఎదుర్కోవాలని సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు విద్యుత్ డిమాండ్ 18.23 శాతం పెరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. విద్యుదుత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతో పాటు మార్కెట్‌లో విద్యుత్ ధరలు కూడా తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం ప్రైవేటు సంస్థలపై ఆధారపడటం తగ్గించాలని సూచించారు. దీనికోసం ప్రణాళికా బద్ధంగా ప్రభుత్వ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి, సరఫరా వంటి అంశాల్లో ఎఐ వంటి టెక్నాలజీని ఉపయోగించి సామర్థ్యం పెంచుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, పొలాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు పెద్దయెత్తున సురభి పంచాయతీ పరిధి నాగులగుట్టపల్లెలో ఆటోతోపాటు సుమారు 30 ద్విచక్ర వాహనాలను టిడిపి వారు కర్రలతో దాడి చేసి ధ్వంసమయ్యాయి. వేంపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ కోసం వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆ పార్టీ శ్రేణులను పోలీసులు బిడాలమిట్ట రోడ్డు వద్ద అడ్డుకున్నారు. దీంతో, మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు నడిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తొండూరు మండలం మల్లేలలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటిం చడంతో టిడిపి కార్యకర్త బైక్ దగ్ఢమైంది.
డిఎస్‌పిపై కడప ఎంపి ఆగ్రహం
వైసిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థులను కేసుల్లో ఇరికించి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని కడప వైసిపి ఎంపి అవినాష్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల డిఎస్‌పి మురళీనాయక్‌కు ఫోన్ చేసిన ఆయన అభ్యర్థులను స్టేషన్లలో ఉంచితే నామినేషన్లు ఎలా వేస్తారని, పోలీస్ స్టేషన్‌లోనే నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని, అక్కడే నామినేషన్ వేస్తామని అన్నారు.
టిడిపికి అనుకూలంగా పోలీసులు
పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరం, అమరావతి మండలం మునగోడు, అచ్చంపేట మండలం చింతపల్లి తదితర గ్రామాల్లో నామినేషన్లను వేయనీయకుండా ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులను టిడిపి వారు అడ్డుకోవడంతో ఘర్షణలు జరిగాయి. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన వైసిపి మద్దతు మహిళలను నాగవరంలో పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ప్రశ్నించిన మహిళలపై లాఠీఛార్జి చేశారు. దీంతో, పలువురికి గాయాలయ్యాయి. మునగోడులో టిడిపి, వైసిపి శ్రేణులు పరస్పరం కర్రలతో కొట్టుకున్నాయి. పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతవరం గ్రామంలో నామినేషన్ వేయడానికి వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేసి సత్తెనపల్లి తరలించారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఎస్‌పికి ఫిర్యాదు చేయడానికి నరసరావుపేట వెళ్తుండగా ఆయనను ముప్పాళ్ల వద్ద అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు.
బిఎస్‌పి మద్దతుదారునిపై టిడిపి నాయకుల దాడి
తిరుపతి నగరం సమీపంలోని సప్తగిరి కాలనీ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా న్యూమంగళం గ్రామపంచాయతీ సచివాలయంలో నామినేషన్ దాఖలు చేసి తిరిగి వస్తున్న బిఎస్‌పి మద్దతుదారుడైన రుద్ర గోపిని టిడిపి నాయకులు దాడి చేసి గాయపడ్డారు. నిందితుల ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని సిఐ సునీల్ కుమార్ తెలిపారు. టిడిపి నాయకులు తంబి అలియాస్ దిలీప్, యువరాజ్, వినోద్ అనే వ్యక్తులు పది మందితో కలిసి తనపై ఇనుప రాడ్లతో దాడి చేశారని రుద్ర గోపి ఆరోపించారు. సకాలంలో పోలీసులు స్పందించకపోయి ఉంటే తనను చంపేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.








కామెంట్‌లు (0)