మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడిఎస్సీ స్పోర్ట్స్ కోటా అవకతవకలపై స్వతంత్ర సంస్థతో విచారణ

1 గంట క్రితం

ap dsc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:53 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిపిఎం డిమాండ్

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : డిఎస్‌‌సి స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై స్వతంత్ర సంస్థతో విచారణ నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వం చెబుతున్న వివరణ మరిన్ని కొత్త సందేహాలను కలిగిస్తోందని పేర్కొన్నారు.

ఉద్యోగ నియామాకాల్లో మార్గదర్శకాలను ఇష్టానుసారంగా మార్చుకున్నట్లు అనేక ఆధారాలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయని, ఈ వ్యవహా రంలో కొద్దిమందిని ఇప్పటికే అరెస్టు చేయడం, మరికొన్ని ఘటనలపై విచారణ చేస్తున్నట్లు ప్రభు త్వం ప్రకటించడం ద్వారా స్పోర్ట్స్ కోటా నియామ కాల్లో అవకతవకలు జరిగినట్లు స్పష్టమవుతోందని తెలిపారు. వీటిపై ప్రభుత్వం సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.

సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ కాలాన్ని రెగ్యులర్ సర్వీసుగా పరిగణించాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు, బకాయి పడిన డిఏ, హెచ్‌ఆర్‌ఏ వెంటనే విడుదల చేయాలని సిపిఎం డిమాండ్‌ ‌చేసింది. సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించింది, ఆరేళ్ల సర్వీసు పూర్తయిన వారికి స్పెషల్ గ్రేడ్ స్కేలు మంజూరు చేయాలని వార్షిక ఇంక్రిమెంట్లు నుండి కనీస నెలవేతనం రూ.30 వేలకు తగ్గకుండా అమలు చేయాలని కోరింది, సచివాలయ ఉద్యోగులకు నష్టం కలిగించే జిఓ నెంబర్ 11ను రద్దు చేయాలని, న్యాయమైన సచివాలయ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వారితో వెంటనే చర్చలు జరిపి పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేసింది.

కానిస్టేబుల్ నియామకాలు వెంటనే చేపట్టాలి

పోలీసు శాఖలో 19,999 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని గతంలో హోమ్ శాఖామాత్యులు ప్రకటించారని, ఇందులో 11,639 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతించినట్లు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. 1600 పోస్టులకు మాత్రమే ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడంపట్ల యువతలో తీవ్ర నిరసన, ఆగ్రహం వ్యక్తమవుతోందని, ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా సుమారు 20 వేల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని సిపిఎం డిమాండ్‌ ‌చేసింది. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపింది.

నిరుద్యోగులపై నిర్బంధానికి ఖండన

కాకినాడలో ధర్నా చేసిన నిరుద్యోగులు, వారికి మద్దతుగా నిలబడ్డ ఎస్ఎఫ్ఐ , డివైఎఫ్ఐ నాయకులకు పోలీసులు నోటీసులిచ్చి వేధించడం, రాజా, సూరిబాబు, రాజేష్ సహా 20 మందిపై కేసులు బుక్ చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్న కోచింగ్ సెంటర్ యజమాని శ్యామ్‌ను బెదిరించడమే కాకుండా అక్రమ కేసు నమోదు చేయడం సరైంది కాదని తెలిపింది. వారిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని కోరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్