మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

2024 నాటి కల్తీ మద్యం మరణాలకు పోలీసులు,ఎక్సైజ్‌ శాఖదే బాధ్యత

1 గంట క్రితం

Spurious liquor in Kallakurichi, Tamil Nadu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జస్టిస్‌ గోకుల్‌‌దాస్‌ కమిషన్‌ నివేదిక

  • నాటి ఘటనలో 70 మంది ప్రాణాలు బలి

చెన్నై : తమిళనాడులోని కల్లకురిచి కల్తీ మద్యం ఘటనకు పోలీసులు, ప్రొహిబిషన్- ఎక్సైజ్ శాఖ అధికారులదే బాధ్యత అని జస్టిస్ బి. గోకుల్‌దాస్ విచారణ కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. కమిషన్‌ ‌నివేదిక మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024 జూన్‌‌లో జరిగిన ఈ కల్తీ మద్యం ఘటనలో 70 మంది మృతి చెందగా, మరో 130 మందికిపైగా వివిధ రకాల అనారోగ్యాలకు గురయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై జస్టిస్ బి. గోకుల్‌దాస్ విచారణ కమిషన్ దర్యాప్తు నిర్వహించింది. "మిథనాల్ నిల్వ, రవాణా, అమ్మకాలను పర్యవేక్షించే అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఉంటే, ఈ ప్రాణాంతక రసాయన పదార్థం చెన్నై నుండి కల్లకురిచికి చేరి ఉండేది కాదు" అని నివేదిక పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్