కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి : విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో మంగళవారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావును ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. మజ్జి శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర టిడిపిలో చేరారు. ఆమెకు కూడా సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రులు కళావెంకట్రావు, కోండ్రు మురళీ, సుజయ్ కృష్ణ రంగారావు, ఎంపీ అప్పలనాయుడు, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, నేతలు ఉన్నారు.








కామెంట్‌లు (0)