మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఢిల్లీలో మూకదాడి

1 గంట క్రితం

manipur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:46 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మణిపూర్‌ సంగీత కళాకారుడి హత్య పై ప్రతిపక్షాల ఆగ్రహం

ఇంఫాల్‌ : దేశవ్యాప్తంగా అమాయకులపై మూకదాడులు పెరిగిపోతున్నాయి. బతుకుతెరువు కోసం వలసొచ్చిన ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై దుండగులు దాడి చేసి హత్యలు చేస్తున్నా డబుల్‌ ఇంజిన్‌ ‌సర్కార్‌ అడ్డుకట్ట వేయడం లేదు. తాజాగా రాజధాని ఢిల్లీలో మణిపూర్‌‌కు చెందిన సంగీత కళాకారుడు విక్రమ్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. తన నివాసంలోనే మూక దాడికి గురైన ఆయన తీవ్ర గాయాలతో ఢిల్లీ ఆశ్రయం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇంటి ముందు చుట్టుముట్టి దాడి..

మణిపూర్​కు చెందిన సంగీత కళాకారుడు చోంగ్తామ్ విక్రమ్‌ సింగ్ (54) ఢిల్లీలోని కిలోక్రి గ్రామంలో నివసిస్తున్నారు. సోమవారం తెల్లవారుజూమున ఆయన ఇంటి సమీపంలో దుండగులు మద్యం సేవిస్తూ గట్టిగా కేకలు వేస్తూ గొడవ పడుతున్న సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చిన సింగ్‌.. నెమ్మదిగా మాట్లాడాలని, సౌండ్‌ తగ్గించాలని కోరారు. దీంతో ఇరువురి మధ్య వివాదం తలెత్తడంతో వారు విక్రమ్​ సింగ్​పై పిడిగుద్దులు, దెబ్బలతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన విక్రమ్​ను ఆయన కుమారుడు వెంటనే హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విక్రమ్​ సింగ్ మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు భారతీయ న్యాయ సంహిత కింద ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేశారు. 15 ఏళ్ల బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు సమీపంలోని దాబాల నుండి ఆహారాన్ని ప్యాక్‌ ‌చేసి సరఫరా చేసేవారని, వీరంతా 15 నుండి 36 ఏళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. ఈ దాడిని ఈశాన్య మీడియా ఫోరం తీవ్రంగా ఖండించింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేసింది.

రాజధానిలో దాడులు ఆందోళనకరం : సిపిఎం

మణిపూర్‌కు చెందిన ప్రసిద్ధ సంగీతకారుడు చోంగ్తామ్ విక్రమ్ సింగ్‌ను కిరాతకంగా హత్య చేసిన సంఘటనను సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మంగళవారం సోషల్‌ ‌మీడియా ఎక్స్‌లో పోస్టు చేసింది. ఢిల్లీ ‘భారతదేశ గూండా రాజధాని’గా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. విక్రమ్ సింగ్‌ జీవిత భాగస్వామి జ్యోత్స్నతో పాటు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది. ఢిల్లీలోని మణిపురీ సముదాయం ఈ హత్యను జాతి వివక్షతో కూడిన హత్యగా పేర్కొనడాన్ని సమర్థించింది. విక్రమ్ కుటుంబం, స్నేహితులు, మణిపురీ కమ్యూనిటీలకు సంఘీభావం తెలిపింది. వారి న్యాయ డిమాండ్లకు మద్దతు ఇస్తున్నామని, మూకదాడులను పరోక్షంగా ప్రోత్సహిస్తూ, జాతివిద్వేషాలను ప్రేరేపిస్తున్న సంకుచిత రాజకీయాలకు బిజెపి ముగింపు పలకాలని డిమాండ్‌ ‌చేసింది.

మంత్రిత్వశాఖ ఏం చేస్తోంది : రాహుల్‌

ఈ ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోనే ఇంటి బయట ఓ తండ్రిని కొట్టి చంపడం ఆందోళనకరమన్నారు. హోంమంత్రి అమిత్​ షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈశాన్య ప్రాంత ప్రజలకు భద్రత లేకుండా పోయందని విమర్శించారు. ఈ మేరకు ఆయన సోషల్‌ ‌మీడియా ఎక్స్‌లో పోస్టు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్