- నలుగురికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని జాలరిపల్లి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోవడంతో డ్రైవర్ తౌఫిక్(24) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అబు, జగుల్, దవలత్, అనిఫా తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని నమక్కల్ జిల్లా ఈరోడ్ ప్రాంతం నుంచి చిత్తూరులో జరిగే ఇస్తిమా కార్యక్రమానికి వెళ్తుండగా ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటకు తీసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 సిబ్బంది క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








కామెంట్‌లు (0)