బ్లెండెల్, లాథమ్ అర్ధ శతకాలు
న్యూజిలాండ్ 246/5
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా తొలుత పట్టు బిగించేలా కనిపించినా.. మ్యాచ్ కొనసాగే కొద్దీ పట్టు పట్టు కోల్పోయింది. తొలి వికెట్‌కు న్యూజిలాండ్ ఓపెనర్లు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పట్టు సాధించారు. ఆ దశలో టీమిండియా బౌలర్లు వరుసగా వికెట్లను సాధించారు. దీంతో కివీస్ జట్టు 110 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. వికెట్లు వరుసగా కోల్పోతున్న న్యూజిలాండ్‌ను కెప్టెన్ లాథమ్, బ్లండెల్ అర్ధసెంచరీలతో ఆదుకొని పట్టు సాధించారు. ఈ టెస్టుకు టీమిండియా జట్టులో గుర్నూర్ బ్రార్ అరంగేట్రం చేసి తొలి వికెట్ అందించాడు. కివీస్ జట్టు 77 పరుగులు చేసి ఒక్క వికెట్ కోల్పోకుండా దుర్భేద్యంగా ఉన్న దశలో ఓపెనర్ డేవన్ కాన్వే (31)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ 128 బంతుల్లో 6 ఫోర్లతో 59 పరుగులు చేసి ఆదుకున్నాడు. లంచ్ విరామ సమయానికి న్యూజిలాండ్ 26 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో సెషన్‌లో మరో 29 పరుగులు జోడించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు లంచ్ విరామానికి ఆతిథ్య జట్టు ఒక వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన యువ పేసర్ గుర్నూర్ బ్రార్, లంచ్‌కు ముందు చివరి బంతికి డెవాన్ కాన్వే (31)ను ఔట్ చేసి టీమిండియాకు కీలకమైన వికెట్ అందించాడు. అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, పిచ్‌పై ఉన్న తేమను దృష్టిలో ఉంచుకుని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా, కివీస్ ఓపెనర్లు లథమ్, కాన్వే ఓపికగా నిలబడ్డారు. ఈ క్రమంలో లథమ్‌కు అదృష్టం కూడా కలిసొచ్చింది. బుమ్రా బౌలింగ్‌లో ఆరంభంలోనే ఎల్బీడబ్ల్యూ అప్పీల్ నుంచి రివ్యూ ద్వారా గట్టెక్కగా, ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో రెండో స్లిప్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్‌ను వదిలేయడంతో బతికిపోయాడు. ఓపెనర్లు ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌పై ఒత్తిడి పెంచారు. అయితే, లంచ్ ముందు చివరి ఓవర్‌లో బ్రార్ అద్భుతంగా బౌలింగ్ చేసి కాన్వేను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. దీంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. ప్రసిధ్ కృష్ణ స్థానంలో గుర్నూర్ బ్రార్‌కు అవకాశం ఇచ్చారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రా కావడంతో, ఈ మ్యాచ్ ఫలితం సిరీస్ విజేతను నిర్ణయించనుంది. న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్‌కు ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కాగా, డేవన్ కాన్వేకు 150వ అంతర్జాతీయ మ్యాచ్. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా కాగా.. రెండో టెస్టులో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది.
గుర్నూర్ బ్రార్ అరంగేట్రం
రెండో టెస్ట్‌కు టీమిండియా జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. ప్రసిధ్ కృష్ణ స్థానంలో గుర్నూర్ బ్రార్‌కు చోటు లభించింది. దీంతో స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌లోనైనా హైదరాబాద్ పేసర్‌కు చోటు లభిస్తుందని ఆశించిన అభిమానులకు మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించలేదు. సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, వరల్డ్ క్లాస్ బౌలర్ అని, బాగా బౌలింగ్ చేస్తున్నాడని మ్యాచ్ ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వెల్లడించినా.. తీరా తుది జట్టులో అతనికి చోటు కల్పించలేదు.
స్కోర్‌బోర్డు...
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (సి)పంత్ (బి)ఆకాశ్ దీప్ 59, కాన్వే (ఎల్‌బి)గుర్నూర్ బ్రార్ 31, నికోల్స్ (సి)ఆకాశ్ దీప్ (బి)కంబోజ్ 16, రచిన్ రవీంద్ర (సి)పంత్ (బి)ఆకాశ్ దీప్ 0, మిఛెల్ (సి)ధృవ్ జురెల్ (బి)సుందర్ 31, బ్లెండెల్ (బ్యాటింగ్) 53, ఫిలిప్స్ (బ్యాటింగ్) 36, అదనం 20. (85 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 246పరుగులు. వికెట్ల పతనం: 1/77, 2/110, 3/110, 4/110, 5/184 బౌలింగ్: బుమ్రా 19-4-37-0, కంబోజ్ 17-5-56-1, ఆకాశ్ దీప్ 21-5-52-2, గుర్నూర్ బ్రార్ 19-4-52-1, సుందర్ 9-1-36-1.







కామెంట్‌లు (0)