శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హాకీ ఫైనల్‌కు భారత మహిళల జట్టు

43 నిమిషాల క్రితం

hockeu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 10:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సెమీస్‌లో మలేషియాపై 6-2గోల్స్‌తో గెలుపు

- నేడు స్వర్ణ పతకానికి చైనాతో ఢీ

- ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీ

భోపాల్‌: ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లోకి భారత జట్టు దూసుకెళ్లింది. నాథూ బర్ఖేడే ఇంటర్నేషనల్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత మహిళలజట్టు 6-2గోల్స్‌ తేడాతో మలేషియాను ఓడించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత మహిళల జట్టు 4-1గోల్స్‌ తేడాతో మలేషియాపై ఆధిక్యతలో నిలిచింది. దీపిక(25, 30వ ని.) రెండు గోల్స్‌ చేయగా.. ముంతాజ్‌(10వ ని.), నవ్‌నీత్‌(18వ ని.) ఒక్కో గోల్‌ చేశారు. దీంతో తొలి అర్ధభాగంలోనే మలేషియాపై భారతజట్టు పట్టు సాధించింది. మలేషియా తరఫున ఏకైక గోల్‌ను అజహర్‌(27వ ని.) చేసింది. ఇక రెండో అర్ధభాగంలో టొప్పో(33వ ని.), ఇషికా(57వ ని.)లో ఒక్కో గోల్‌ చేయగా.. మలేషియా తరఫున మరో గోల్‌ను జుల్‌కిఫి(52వ ని.)లో చేసింది. తొలి సెమీస్‌లో పటిష్ట చైనా జట్టు 1-0తో జపాన్‌ను ఓడించింది. శనివారం భారత్‌-చైనా జట్ల మధ్య స్వర్ణ పతక పోరు జరగనుంది. కాంస్య పతకానికి జపాన్‌, మలేషియా జట్లు తలపడనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్