- చాట్రాయి మండలం కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులి
ప్రజాశక్తి - అమరావతి : ఎన్టీఆర్ జిల్లా వాసులను పెద్దపులి భయాందోళనకు గురిచేస్తోంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటలోని జోడిదిబ్బ గడ్డపై నిన్న కనిపించిన పెద్దపులి.. తాజాగా చాట్రాయి మండలం మర్లపాలెం మీదుగా కొండ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించారు. పెద్దపులి సంచారంతో అప్రమత్తమైన అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు సంబంధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరూ ఒంటరిగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, పొలాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో పులిని పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు. పులి కదలికలపై నిరంతరం నిఘా ఉంచామని, ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.







కామెంట్లు (0)