- పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ప్రజాశక్తి - దాచేపల్లి : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కంటైనర్ లారీ డ్రైవర్‌తో పాటు ఇద్దరు కూలీలు ఉన్నారు. కర్ణాటక నుంచి చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీకి లోడుతో వస్తున్న కంటైనర్ లారీ గామాలపాడు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం పక్క రోడ్డుపైకి వస్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
ఈ ఘోర ప్రమాదంలో కంటైనర్ లారీ డ్రైవర్, ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







కామెంట్‌లు (0)