సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయి విడుదల చేయాలి

2 గంటల క్రితం

ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయి విడుదల చేయాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 09:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా

- డిఆర్ ఒకు వినతి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బకాయి ఉన్న ఫీజు రియంబర్స్‌‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమవారం విద్యార్థులు ధర్నా చేశారు. ముందుగా కోట దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి అనంతరం ఈ కార్యక్రమం నిర్వమించారు. డిఆర్‌ఒకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము మాట్లాడుతూ గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులు ఫీజు కట్టకుండా ప్రశాంతంగా చదువుకోవచ్చని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులను మోసం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రతినెలా బకాయి లేకుండా కళాశాలలకు ఫీజు రీయంబర్సుమెంట్ డబ్బులు వేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోందని, అయితే, రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,500 కోట్లకుపైగా పెండింగ్‌ ఎందుకు ఉందని ప్రశ్నించారు. విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, చిత్తూరులో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఇప్పటికైనా విద్యార్థులను మభ్యపెట్టే ప్రకటనలకు పరిమితం కాకుండా బకాయి ఉన్నటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ భారతి, పట్టణ అధ్యక్షులు సూరిబాబు, నాయకులు కృష్ణ, గుణ, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్