శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫోర్ట్ సిటి పాఠశాలలో తెలుగుభాషా, క్రీడా దినోత్సవం

1 గంట క్రితం

WhatsApp Image 2026-08-29 at 2.51.23 PM.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 04:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి.. విజయనగరం టౌన్ :ఫోర్ట్ సిటీ పాఠశాలలో గిడుగు రామ్మూర్తి జన్మదినం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం, థ్యాన్‌‌చంద్‌ జన్మదినం సందర్భంగా క్రీడా దినోత్సవాలను ఘనంగా జరిపారు. 23-08-2026 నుండి 29-08-2026 తేదీ వరకు తెలుగు భాషా వారీత్సవాలు జరిగాయి. ఈ తెలుగు భాషా వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు, వ్యాసరచన, క్విజ్ వక్తృత్వం, పద్యపఠనం, వేషాధారణ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేసారు. అదే విధంగా కొంతమంది విద్యార్థులు ఆటలు ఆడే విధానంను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల చైర్మన్ కె. ఎ.పి. రాజు (శివ) మాట్లాడుతూ తెలుగు భాష గొప్పుతనం గురించి, క్రీడల ప్రయోజనాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ చంటి, ప్రిన్సిపల్ డాక్టర్ రీయినాఖాన్ డైరెక్టర్లు మథు, అశీక్, నీలిమా తెలుగు ఉపాధ్యాయులు, వ్యాయామపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్