సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అనపర్తి ఏరియా ఆసుపత్రి ఉద్యోగుల మానవహారం

29 ఆగస్టు, 2026

WhatsApp Image 2026-08-29 at 4.38.49 PM.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 04:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అనపర్తి : ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు అనపర్తి ఏరియా ఆసుపత్రి వద్ద శనివారం కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. రెండో రోజుకు చేరిన ఈ ఆందోళనలో భాగంగా ఆసుపత్రి విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, తమ భోజన విరామ సమయంలో ఉద్యోగులంతా మానవహారంగా నిలబడి నిరసన వ్యక్తపరిచారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అందరికీ 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో హాస్పిటల్ కాంట్రాక్ట్ సిబ్బంది విజయకుమార్, చైతన్యరాజు, వినోద్, క్రాంతి, మీనా, హేప్సీభ, రామలక్ష్మి, ఇందిర, శ్రీ ఆదిలక్ష్మి, కీర్తి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్