బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బలవంతంగా పురుగులమందు తాగించిన తోటి విద్యార్థులు

3 గంటల క్రితం

Fellow students forced the victim to drink pesticide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 03:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. స్కూల్‌కు వెళ్లి ఇంటికొచ్చిన పదో తరగతి విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తల్లిదండ్రులు చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగానే ఉంది. తోటి విద్యార్థులే బలవంతంగా పురుగుల మందు తాగించారని బాధిత విద్యార్థి తెలిపినట్లు సమాచారం. ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో వీరంతా చదువుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు విద్యార్థులపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్