బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సిమ్స్ యాజమాన్యం ఫర్నిచర్ వితరణ

35 నిమిషాల క్రితం

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సిమ్స్ యాజమాన్యం ఫర్నిచర్ వితరణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 06:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అనంతపురం

నగర శివారులోని సిండికేట్‌నగర్‌లో ఉన్న సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం సామాజిక బాధ్యతగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి రూ. 3 లక్షల విలు‌వ చేసే ఫర్నిచర్‌ను అందజేశారు. సిమ్స్ ఆసుపత్రి యాజమాన్య ప్రతినిధులు జి.రామకృష్ణారెడ్డి, డాక్టర్ జి.స్వరూప్‌రెడ్డి, డాక్టర్ ఎం.అశ్వ‌ర్థరెడ్డి బుధవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి సమక్షంలో ఆసుపత్రికి ఫర్నిచర్‌‌ను అందజేశారు. వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు వచ్చే రోగులు, వారి సహాయకులకు ఉపయోగపడేలా వీటిని అందజేశామన్నారు. వైద్య సేవలకు చేయూతనిస్తూ సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన సిమ్స్ యాజమాన్యాన్ని పలువురు అభినందించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్