సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేడే పట్టణ ఎన్నికల ఫలితాలు..

1 గంట క్రితం

vote-
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 01:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 92 పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. ఈ నెల ఒకటిన జరిగిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని మొత్తం 3,186 వార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థులుగా 153 మంది, మున్సిపల్ ఛైర్మన్ పదవులకు 367 మంది, కార్పొరేటర్ స్థానాలకు 3,073 మంది, కౌన్సిలర్ స్థానాలకు 6,669 మంది పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాల్లో 556 హాళ్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. వీటిలో మొత్తం 6,831 కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేసింది. ఓట్ల లెక్కింపునకు 47,817 మంది సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, ఇతర సిబ్బందిని నియమించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్