శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శకటాల ప్రదర్శనలో విద్యా, ఉద్యానవన శాఖకు మొదటి స్ధానం

1 గంట క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 11:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

-​ కవాతు విభాగంలో అవార్డులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజశాని అమరావతిలోని నేలపాడులో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో శకటాల ప్రదర్శనను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యా సమగ్ర శిక్ష శకటానికి, ఉద్యానవన శాఖల శకటానికి సంయుక్తంగా ప్రథమ బహుమతి లభించింది. ద్వితీయ బహుమతి గా నేతన్నల సంక్షేమమే లక్ష్యం గా కృషి చేస్తున్న చేనేత, జౌళిశాఖకు లభించింది. అడవులను రక్షించండి, వన్య ప్రాణులను కాపాడండి అంటూ హరితాంధ్ర లక్ష్యంగా చేసుకుని సాగిన అటవీ శాఖ శకటానికి తృతీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కవాతు, శకటాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ విభాగాల ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన బృందాలకు బహుమతులు అందజేశారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాలపై ప్రభుత్వం వేస్తున్న అడుగులను వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన నిర్వహించారు. భాషా, సాంస్కృతిక శాఖ, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, రెవెన్యూ శాఖ, అటవీ శాఖ, పర్యాటక శాఖ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఇంధన శాఖ, రవాణా శాఖ,ఎపిఎస్ఆర్ టిసి, మహిళలు, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ, ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ, జల వనరుల శాఖ, పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష, ఉన్నత విద్యా శాఖ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, చేనేత, జౌళి శాఖ, ఎపిసిఆర్ డిఎ, అమరావతి, గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు, పరిశ్రమల శాఖ, ప్రణాళిక శాఖ, దేవాదాయ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, గనులు, భూగర్భ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ వంటి దాదాపు 25 శాఖల నుండి వచ్చిన శకటాల ప్రదర్శనలో పాల్గొన్నాయి.

ఉత్తమ అమర్ కాంటింజెంట్ గా ఎపిఎస్ పి, కర్నూలు కు రెండో స్థానం, రెండో ఉత్తమ ఆర్మ్డ్ కాంటింజెంట్ గా కర్ణాటక స్టేట్ స్పెషల్ పోలీస్, ఉత్తమ అన్‌ఆర్మ్డ్ కాంటింజెంట్ గా ఎపి సోషల్ వెల్ఫేర్, రెండో ఉత్తమ అన్‌ఆర్మ్డ్ కాంటింజెంట్ గా ఎన్ సిసి బాలికల బృందం, కన్సొలేషన్ బహుమతిగా సైనిక్ వెల్ఫేర్ లకు లభించాయి. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వివిధ శాఖలు, పోలీసు, భద్రతా బలగాలు ప్రదర్శించిన క్రమశిక్షణ, ప్రతిభ, రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించే శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.విజేతలుగా నిలిచిన బృందాలను అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్