చిరునవ్వులోని హాయి
నవ్వవోయి హాయిగా
తనివి తీర తీయగా
నవ్వు మనకు మేలు చేయు
నాలుగింతలెక్కువగా!
చిరునవ్వు మోముపైన
చిరాకును చెరిపివేయు
గట్టిగా నవ్వు నవ్విన
గుండె ఎంతో పదిల పడును
సరదాగా నవ్వినప్పుడు
సమస్యలే గుర్తు రావు
సిరిగల నవ్వుని ఎప్పుడూ
చెరగనీకు, చెదరనీకు
శాంతిని కూర్చే నవ్వు
శత్రువులను ఉండనీదు.
సాంత్వన తెచ్చే నవ్వు.
చక్కని ఆరోగ్యమిచ్చు
ఒక నవ్వుతో గెలవచ్చు
కఠినమైన మనస్సును
నవ్వు ముఖం నీదైతే
ప్రతి ఒక్కరూ స్నేహితులే
స్నేహానికి చేయి చాచు
ఉన్నంతలో సాయపడు
సంతోషం సగం బలం
ఈనాటికి అదే నిజం
వెకిలి నవ్వు కూడదెపుడు
పరుల చూచి నవ్వరాదు
నవ్వు నాల్గు విధాల చేటు
అను నానుడి మరువవద్దు!
- కూచిమంచి నాగేంద్ర,
91821 27880.







కామెంట్‌లు (0)