బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమరో సంఘటనలో మత్స్యకారులు క్ష‍ేమం

17 నిమిషాల క్రితం

Rameswaram fishermen
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 11:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగా సముద్రంలో నిలిచిపోయిన కాకినాడ రూరల్ మండలం ఏటిమొగ ప్రాంతంలో మత్స్యకారుల బోటు సురక్షితంగా కాకినాడ హార్బర్ కు చేరుకుంది. ఈ బోటులోని ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏటిమొగ నుంచి అదే గ్రామానికి చెందిన సేరు రామలక్ష్మికి చెందిన బోటులో ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 23వ తేదీ తెల్లవారుజామును సముద్రంలో వేటకు వెళ్లారు. అదేరోజు రాత్రి ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో బోటు ఉప్పాడ-తుని తీరంలోని కృష్ణాపురం సమీపంలో నిలిచిపోయింది. సముద్రం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో నిలిచిపోవడంతో డ్రైవర్ దమ్ము అప్పారావు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్య్యారు. వెంటనే కోస్ట్‌గార్డ్, నౌకాదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సముద్రపు నీటి లోతు తక్కువగా ఉండడంతో అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. బోట్ల యజమానుల సంఘం నాయకులు, మత్స్యకారుల సహకారంతో బోటును సురక్షితంగా కాకినాడ హార్బర్‌‌కు తరలించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు, సంబంధిత సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్